అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి నర్సయ్య (BC Welfare Officer Narsaiah) తెలిపారు.
ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో (New Ambedkar Bhavan) జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వినాయక్ నగర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి, న్యూ అంబేద్కర్ భవన్లో జయంతి ఉత్సవాలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.