AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AI Summit Protest | ఢిల్లీ (Delhi)లో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

అయితే ఘటనకు సంబంధించి ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు (Delhi Youth Congress President) ఉదయ్‌ భాను చిబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరుకుంది.

AI Summit Protest |దాదాపు 20 గంటల పాటు విచారణ

ఏఐ ఇంపాక్ట్​ సమిట్​ (AI Impact Summit) వద్ద నిరసనలపై పోలీసులు ఉదయ్‌ భానును దాదాపు 20 గంటలపాటు విచారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లుగా వెల్లడించాయి. నిరసనలకు సంబంధించి ఆయన కీలక పాత్ర పోషించినట్లుగా ఆధారాలు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు (Delhi Patiala House Court)లో హాజరుపర్చారు. అతడికి ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడికి నాలుగు రోజుల కస్టడీ విధించింది.

Related articles

Kerala Renaming | కేరళ పేరు మార్పు.. కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Renaming | కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ  (PM Modi)...

Dundigal Police | రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసిన తల్లి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dundigal Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని దుండిగల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ...

BJP Condemns Attacks | అమాయకులపై అసాంఘిక శక్తుల దాడులను ఖండిస్తున్నాం..

అమాయక ప్రజలపై అసాంఘిక శక్తుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి సీపీ సాయి చైతన్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

KTR Political Warning | అధికారం శాశ్వతం కాదు.. మళ్లీ కేసీఆర్​ సీఎం అవుతారు : కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Political Warning | డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు,...