అక్షరటుడే, వెబ్‌డెస్క్: Smart Phone | ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్(Smart Phone) యుగం నడుస్తోంది. కాగా.. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్త. దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త బ్రాండ్ AI+ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్‌ను రియల్‌మీ మరియు హానర్ ఇండియా మాజీ సీఈవో మాధవ్ సేథ్ ప్రారంభించిన Nxt Quantum Shift Technologies సంస్థ తీసుకొచ్చింది. దీనిని రెండు మోడళ్లలో లాంచ్ చేశారు. ఒకటి AI+ పల్స్ (4G ఫోన్) కాగా, మరొకటి AI+ నోవా (5G ఫోన్).
Smart Phone | బెస్ట్ ఫోన్స్..
ఈ ఫోన్లు అత్యంత తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. ఇవి బడ్జెట్ ధరలోనే ఉన్నా, ప్రీమియం లుక్, మంచి పనితీరు, డేటా భద్రత దృష్ట్యా వినియోగదారులకు ఉత్తమ అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈ మొబైల్ ప్రాసెసర్ & డిస్‌ప్లే విషయానికి వస్తే.. AI+ పల్స్ (4G) – Unisoc T615 ప్రాసెసర్, AI+ నోవా (5G) – Unisoc T8200 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఏఐ ప్లస్ పల్స్, ఏఐ ప్లస్ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 90Hz, 120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఏఐ ప్లస్ పల్స్ ఫోన్‌లో Unisco T615, నోవా 5జీలో Unisco T8200 ప్రాసెసర్ ఉంటుందని కూడా తెలియజేశారు.
ఇక కెమెరా విషయానికి వస్తే.. రేర్ కెమెరా: 50MP, ఫ్రంట్ కెమెరా: 5MP ఉంటుంది. బ్యాటరీ: 5000mAh. ఛార్జింగ్ విషయానికి వస్తే 18W ఫాస్ట్ ఛార్జింగ్. AI+ పల్స్ (4G)లో 4GB + 64GB – ₹4,999 కాగా, 6GB + 128GB – ₹6,999. జులై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. AI+ నోవా (5G) విషయానికి వస్తే.. 6GB + 128GB – ₹7,999 కాగా, 8GB + 128GB – ₹9,999గా ఉన్నాయి. ఇవి జులై 13 నుండి ఇవి అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటాయి. OS విషయానికి వస్తే.. Android 15 ఆధారిత NxtQ OS. భారత మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకొని ఈ ఫోన్‌ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ ఫోన్లు ప్రధానంగా బడ్జెట్ కస్టమర్ల కోసం మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.