అక్షరటుడే, ఢిల్లీ : AI Leadership | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ ఏఐ సమ్మిట్-2026 (India AI Summit-2026) సదస్సులో ఆయన శుక్రవారం ప్రసంగించారు. నూతన ఆవిష్కరణలు మన జీవితాల్లో పెను మార్పులు తెస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే మన జీవన విధానంలోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
AI Leadership | వ్యవసాయరంగానికి దోహదం
వ్యవసాయరంగానికి ఏఐ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏఐ స్టార్టప్స్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో నేషనల్ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
AI Leadership | ఏఐ వార్ రూం ఏర్పాటు చేయాలి
ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకోసం హైదరాబాద్ (Hyderabad) ఎంతో అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏఐ వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి ఆరునెలలకు హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఐఏ సదస్సులు జరగాలన్నారు. అయితే ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
AI Leadership | అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐలో స్టార్టప్‌లను భారత్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావంచూపిస్తోందన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందని.. గతంలో పారిశ్రామి విప్లవం వచ్చిందని.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం నడుస్తోందన్నారు.