అక్షరటుడే, వెబ్‌డెస్క్: AI Impact on Stock Market | యూఎస్ సీపీఐ డాటా ఈరోజు విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. దీని ప్రభావం గ్లోబల్ మార్కెట్ల (global markets)పైనా కనిపిస్తోంది. మరోవైపు టెక్ స్టాక్స్ ‘ఆంథ్రోపిక’ షాక్‌నుంచి కోలుకోవడం లేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుండడంతో ఐటీ సెక్టార్లో పతనం కొనసాగుతోంది. మెటల్ స్టాక్స్ కూడా సూచీలను కిందికి లాగుతున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 772 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 177 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 308 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 236 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 59 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 117 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 802 పాయింట్ల నష్టంతో 82,872 వద్ద, నిఫ్టీ (Nifty) 261 పాయింట్ల నష్టంతో 25,545 వద్ద ఉన్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతం వరకు నష్టపోగా లార్జ్ క్యాప్ స్టాక్స్ సైతం ఒక శాతానికిపైగా నష్టంతో సాగుతున్నాయి.
కోలుకోని ఐటీ..
ఐటీ సెక్టార్లో సెల్లాఫ్ కొనసాగుతోంది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతానికిపైగా, ఐటీ ఇండెక్స్ 2.8 శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి. రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, యుటిలిటీ, మీడియా, టెలికాం, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫఎంసీజీ రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ మాత్రమే లాభాలతో ఉండగా.. 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 1.22 శాతం, మారుతి 0.14 శాతం, ఎస్బీఐ 0.03 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 3.68 శాతం, ఎటర్నల్ 3.34 శాతం, టీసీఎస్ 2.71 శాతం, అదానిపోర్ట్స్ 2.19 శాతం, హెచ్‌యూఎల్ 2.14 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.