HomeతెలంగాణAI lessons in government school | సర్కారు బడుల పిల్లలకు ఏఐ, డేటా సైన్స్...

AI lessons in government school | సర్కారు బడుల పిల్లలకు ఏఐ, డేటా సైన్స్ పాఠాలు.. ఎప్పటి నుంచంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: AI lessons in government school : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సువర్ణాధ్యాయం మొదలు కాబోతోంది. నిరుపేద విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విద్య Technology education అందుబాటులోకి వస్తోంది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial Intelligence AI (ఏఐ) తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. దసరాకు అటు ఇటుగా.. ఉన్నత పాఠశాల స్థాయిలో డిజిటల్ లెర్నింగ్ తరగతులను ప్రారంభించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ Education డిపార్ట్మెంటు ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే దీనిపై టీచర్లకు శిక్షణ తరగతులు చేపట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సర్కారు బడుల పిల్లలకు టెక్నాలజీని దరిచేర్చే అడుగులు పడుతున్నాయి.

AI lessons in government school : ఫ్యూచర్ రెడీ తెలంగాణ

‘ఫ్యూచర్ రెడీ తెలంగాణ’లో భాగంగా టెక్నాలజీ లెర్నింగ్​ వైపు అడుగులు పడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిజిటల్ లెర్నింగ్ సబ్జెక్టును సర్కారు తీసుకొస్తోంది.

లోకల్ బాడీ, గవర్నమెంట్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు వేల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

వీటిల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ క్లాసులు అందనున్నాయి. ఇందుకోసం ఫైజామ్ ఫౌండేషన్​ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదిరింది.

Must Read
Related News