HomeజాతీయంAI Content New Rules | డీప్​ఫేక్​, AI కంటెంట్​ దుర్వినియోగ కట్టడికి చర్యలు.. కేంద్రం...

AI Content New Rules | డీప్​ఫేక్​, AI కంటెంట్​ దుర్వినియోగ కట్టడికి చర్యలు.. కేంద్రం కీలక సవరణలు

AI Content New Rules | డీప్​ఫేక్, జనరేటివ్​ ఏఐ సాంకేతికతల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అడుగులు పడుతున్నాయి. 

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: AI Content New Rules | డీప్​ఫేక్ deep fake, జనరేటివ్​ ఏఐ సాంకేతికతల generative AI technologies దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అడుగులు పడుతున్నాయి.

ఈమేరకు ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఏఐ దుర్వినియోగానికి తెర పడనుంది.

ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్​ కోడ్​) రూల్స్​, 2021కి పలు సవరణలు ప్రతిపాదిస్తూ బుధవారం (అక్టోబర్​ 22) ఓ ముసాయిదాను ప్రకటించింది.

AI Content New Rules | కొత్త రూల్​ ఏమి చెబుతుందంటే..

సోషల్ మీడియాలో ఏఐ ద్వారా రూపొందిన కంటెంట్​కు స్పష్టంగా లేబులింగ్ ఇవ్వాలి. కృత్రిమమేథ ద్వారా రూపొందించిన కంటెంట్​ / వీడియో / ఆడియో అని స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది.

ఈమేరకు సోషల్ మీడియా social media వేదికలు తప్పని సరిగా​ ఇంటర్​మీడియరీస్​ (ఎస్​ఎస్​ఎంఐ) Intermediaries (SSMI) లేబులింగ్​, మెటాడేటా ట్యాగింగ్​, విజిబిలిటీ నిబంధనలు పాటించాలి.