HomeUncategorizedAhmedabad air crash | ఘోర ప్ర‌మాదం.. మాజీ సీఎం , పైలట్స్ సహా 242...

Ahmedabad air crash | ఘోర ప్ర‌మాదం.. మాజీ సీఎం , పైలట్స్ సహా 242 మంది మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ahmedabad air crash : గుజరాత్ వాణిజ్య రాజధాని(commercial capital) అహ్మదాబాద్(Gujarat) ఎయిర్ పోర్టు(Ahmedabad Airport) Airport సమీపంలో గురువారం చోటుచేసుకున్న విమాన ప్రమాదం ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తించింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండ‌గా, అందులో అంద‌రు చనిపోయినట్లు అహ్మాదాబాద్‌ సీపీ తెలిపారు. 232 ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్యాబిన్‌ సిబ్బంది అంతా చనిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న వాళ్లు మాత్రమే కాకుండా.. విమానం కూలిన బిల్డింగ్‌లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్‌ విద్యార్థులు కూడా మృతి చెందారు. వారు ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా వెల్లడించలేదు.

Ahmedabad air crash : ఒక్క‌రు మిగ‌ల్లేదు..

మృతుల్లో గుజరాత్ Gujarat మాజీ ముఖ్యమంత్రి Former Chief Minister, బీజేపీ సీనియర్ నేత senior BJP leader విజయ్ రూపానీ Vijay rupani కూడా ఉన్నారు. లండన్ లోని తన భార్యను తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆయన అహ్మదాబాద్ దాటక ముందే అగ్ని కీలలకు ఆహుతి అయిపోయిన వైనం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. విమానంలో పైలట్లు, సహాయక సిబ్బంది మొత్తం 12 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా… 53 మంది బ్రిటిషర్లు, 7 మంది పోర్చుగీస్ వారు, ఓ కెనడియన్ ఉన్నారు. ఇక ప్రయాణికుల్లో ఇద్దరు పసిపిల్లలతో పాటు 12 మంది చిన్నారులు ఉన్నారు.

అహ్మదాబాద్ Ahmedabad ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయానికి సమీపంలోని జనావాసాలపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం స్థాయిని గుర్తించిన అధికారులు…విమానంలోని ఏ ఒక్కరు కూడా బ్రతికి బయటపడే అవకాశాలే లేవని ముందే ఊహించారు. ఎందుకంటే… విమానంలోని భారీ స్థాయిలోని ఫ్యూయల్ విమానాన్ని, అది కూలిన పరిసరాలను దహించివేసింది. ఫలితంగా విమానంలోని ఒక్కరంటే ఒక్కరు కూడా బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు. ఇక విమాన ప్రమాదం కారణంగా బయట ఉన్న వారు ఎంతమంది చనిపోయారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

విమానంలో భారత్ India కాకుండా మూడు దేశాలకు చెందిన పౌరులు ఉండటంతో ఆయా దేశాల నుంచే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున స్థానిక అధికారులపై ఒత్తిడి వచ్చింది. ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో బయట పరిసరాల్లోని చనిపోయినవారి సంఖ్య కూడా కలుపుకుంటే… మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.