ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana | అహల్యాబాయి చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి

    Mla Dhanpal Suryanarayana | అహల్యాబాయి చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | అహల్యాబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమ లాంటి వీరవనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal) అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం అహల్యబాయ్ హోల్కర్(Ahalyabai Holkar) శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక సేవారంగంలో మహిళలను చైతన్యం చేయడంలో అహల్య దేవి చేసిన సేవలు మరువలేనివన్నారు.

    వందలాది దేవాలయాలు, ధర్మశాలలను కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ, మరమ్మతులకు ఆమె కృషి చేశారని గుర్తు చేశారు. మహిళా రక్షణ దళాలు ఏర్పాటు చేసిన వీరవనిత అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్సీ మలక్క కొమురయ్య మాట్లాడారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు, సురేష్, డీఈవో అశోక్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, బద్రీనాథ్, ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...