Homeబిజినెస్​Advance Agrolife Limited IPO | పబ్లిక్‌ ఇష్యూకు ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ.. గ్రే మార్కెట్‌...

Advance Agrolife Limited IPO | పబ్లిక్‌ ఇష్యూకు ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ.. గ్రే మార్కెట్‌ ప్రీమియం ఎంతంటే?

Advance Agrolife Limited IPO | ఆగ్రో కెమికల్స్‌(Agro chemicals), ఫెస్టిసైడ్‌ సెక్టార్‌కు చెందిన అడ్వాన్స్‌ ఆగ్రోలైఫ్‌ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం ప్రారంభం కానుంది. కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో పది శాతం ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

అడ్వాన్స్‌ ఆగ్రోలైఫ్‌(Advance Agrolife) కంపెనీని 2002లో ఏర్పాటు చేశారు. ఇది విస్తృత శ్రేణి వ్యవసాయ రసాయన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రధానంగా తృణధాన్యాలు, కూరగాయలు మరియు ఉద్యాన పంటల సాగులో ఉపయోగించేందుకు ఆగ్రో కెమికల్స్‌ తయారు చేయడం ద్వారా ప్రసిద్ధిచెందింది. తమ వద్ద వ్యవసాయ రసాయనాల కోసం 380 ఫార్ములేషన్‌ గ్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ మరియు 30 టెక్నికల్‌ గ్రేడ్‌ రిజిస్ట్రేషన్‌తో కూడిన మొత్తం 410 జనరిక్‌ రిజిస్ట్రేషన్‌లు ఉన్నట్లు ఆర్‌హెచ్‌పీ(RHP)లో పేర్కొంది. పురుగుమందులు, కలుపు నివారకాలు, శిలీంద్రనాశకాలు, మొక్కల పెరుగుదల నియంత్రకాలు ఉన్నాయి. సూక్ష్మపోషక ఎరువులు మరియు జీవ ఎరువులు వంటి ఇతర వ్యవసాయ రసాయన ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది.

వ్యవసాయానికి సంబంధించిన పలు ఉత్పత్తులున్నాయి. దేశంలోని పందొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో B2B ప్రాతిపదికన కార్పొరేట్‌ కస్టమర్లకు ప్రత్యక్షంగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. యూఏఈ(UAE), బంగ్లాదేశ్‌, చైనా, హాంకాంగ్‌, టర్కీ, ఈజిప్ట్‌, కెన్యా మరియు నేపాల్‌ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు ఆర్‌హెచ్‌పీలో పేర్కొంది. ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 192.86 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని వర్కింగ్‌ క్యాపిటల్‌(Working Capital) కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌ : 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 457.21 కోట్ల ఆదాయం(Revenue) రాగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 502.88 కోట్లు వచ్చింది. నికర లాభాలు(Net profit) రూ. 24.73 కోట్లనుంచి రూ. 25.64 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు రూ. 259.56 కోట్లనుంచి రూ. 351.47 కోట్లకు చేరాయి.

ధరల శ్రేణి..

ప్రైస్‌ బ్యాండ్‌ : రూ. 95 – రూ. 100.
లాట్‌ సైజ్‌ : 150 షేర్లు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్‌ వద్ద రూ. 15 వేలతో బిడ్‌ వేయాలి. ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ గరిష్టంగా 13 బిడ్లు వేయవచ్చు.

కోటా..

క్యూఐబీ : 50 శాతం.
రిటైల్‌ : 35 శాతం.
ఎన్‌ఐఐ : 15 శాతం.

జీఎంపీ..

అడ్వాన్స్‌ ఆగ్రోలైఫ్‌ కంపెనీ షేర్లు గ్రేమార్కెట్‌లో రూ. 10 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అంటే ఐపీవో అలాట్‌ అయ్యేవారికి లిస్టింగ్‌ సమయంలో పది శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

ప్రారంభ తేదీ : సెప్టెంబర్‌ 30.
ముగింపు తేదీ: అక్టోబర్‌ 3.
అలాట్‌మెంట్‌ తేదీ : అక్టోబర్‌ 6.
లిస్టింగ్‌ తేదీ : అక్టోబర్‌ 8 (ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ).

Must Read
Related News