అక్షరటుడే ఇందూరు: Collector Ila Tripathi| జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయంలో సోమవారం జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు.
Collector Ila Tripathi | వ్యవసాయం రంగంలో ప్రత్యేక స్థానం..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా (Nizamabad district) తనదైన ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ.. అవసరమైన వారికి తోడ్పాటు అందించాలన్నారు. జిల్లాలో పసుపు రైతులకు (turmeric farmers) పంట సాగు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ.. ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తూ ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Collector Ila Tripathi | యూరియా నిల్వలు..
రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మోతాదు మేరకే యూరియా వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల పంపిణీలో అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో డీసీసీబీ జీఎం అనుపమ, సీఈవో నాగభూషణం, లీడ్ బ్యాంకు మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.