అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారు. ప్రజల అవసరాలను తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల డీలర్లు (fertilizer dealers) అందరి దగ్గర యూరియా ఉండటం లేదు. సొసైటీలు, కొన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రం యూరియా విక్రయిస్తున్నారు. దీనిని కూడా అవినీతి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వనపర్తి జిల్లాలోని (Wanaparthy district) ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రానికి అంతరాయం లేకుండా యూరియా సరఫరా చేయడానికి జిల్లా వ్యవసాయ అధికారి లంచం డిమాండ్ చేశాడు. యాసంగి సీజన్‌కు సంబంధించి యూరియా సరఫరా కోసం రూ.20 వేలు ఇవ్వాలని డీఏవో పుప్పాల ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చస్త్రశారు. అందులో గతంలో రూ.3 వేలు తీసుకున్నాడు. తాజాగా మరో రూ.10 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.