అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Farmers | ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో రైతన్నల పాత్ర మరువలేనిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్‌తో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగమే అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా మహబూబాబాద్ జిల్లాకు సుమారు రూ.3.16 కోట్లు సబ్సిడీ కింద ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పనిముట్లలో వందల కోట్లతో సబ్సిడీ ఇచ్చి వ్యవసాయంలో యాంత్రికీకరణ భాగస్వామ్యాన్ని పెంచుతామని తెలిపారు.
Farmers | రైతును రాజు చేయడమే లక్ష్యం
గత పాలకులు వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఎత్తివేసి, రైతలను ఇబ్బందులకు గురిచేశారని మంత్రి విమర్శించార. పదేళ్లలో రైతులకు ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటికి స్వస్తి పలుకుతూ.. రైతును రాజు చేయడమే ధ్యేయంగా అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే రూ. 2లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రైతు భరోసా (Rythu Bharosa) పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతులకు చుట్టంలా ఉండే భూ భారతి చట్టాన్ని తెచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా వ్యక్తిగత భేషజాలు, కక్ష సాధింపులు లేవన్నారు.