అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను బుధవారం (ఆగస్టు 20) భారతదేశం విజయవంతంగా పరీక్షించింది.
“ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను ఒడిశా(Odisha)లోని ఛండీపూర్(Chandipur)లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం అన్ని కార్యాచరణాలను ధృవీకరించింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) వెల్లడించింది.
Agni-5 missile : విమానయాన సంస్థలకు నోటామ్
ఆయుధాన్ని ఉపయోగించే వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో అగ్ని–5 పరీక్ష (Agni-5 missile) నిర్వహించారు. క్షిపణి పరిధి గురించి మంత్రిత్వ శాఖ ప్రకటించలేదు. కానీ, గత వారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలకు నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) NOTAM (Notice to Airmen) జారీ చేశారు. దీని ప్రకారం క్షిపణి దాదాపు 4,800 కి.మీ దూరం ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Agni-5 missile : 2012లో మొదటిసారి
2012లో అగ్ని-5ను మొదటిసారిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పరీక్షించింది. తద్వారా అంతర్-ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను intercontinental range ballistic missiles అభివృద్ధి చేయగల దేశాల చిన్న క్లబ్‌లోకి భారత్ ప్రవేశించింది.
సుమారు ఆరు పరీక్షల తర్వాత, అగ్ని–5ని 2021లో మొదటి యూజర్ ట్రయల్ నిర్వహించిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌కు అప్పగించారు.
అణు nuclear సామర్థ్యం కలిగిన, 17.5 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువున్న ఈ క్షిపణి మూడు దశల రాకెట్, అనేక కీలకమైన దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలను కలిగి ఉంది.
అగ్ని–5లో కాంపోజిట్ రాకెట్ మోటార్, అత్యాధునిక ఏవియానిక్స్, 5వ తరం ‘ఆన్ బోర్డ్ కంప్యూటర్’ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్, అత్యంత కచ్చితమైన రింగ్ లేజర్ గైరో-ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ring laser gyro-based inertial navigation system (RINS), నమ్మకమైన రిడండెంట్ మైక్రో నావిగేషన్ సిస్టమ్ redundant micro navigation system, 4,000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే రీ-ఎంట్రీ కిట్ షీల్డ్ ఉన్నాయి. ఇది 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడం ద్వారా ఏవియానిక్స్ సాధారణంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది.
ఆగస్టు 31 – సెప్టెంబరు 1 తేదీలలో టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ Shanghai Cooperation Organisation (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi).. చైనా పర్యటనకు వారం ముందు ఈ క్షిపణి పరీక్ష జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సన్నాహక పర్యటనలో భాగంగా.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి Chinese Foreign Minister Wang Yi ఆగస్టు 18 – 19 తేదీలలో న్యూఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రిని కలిశారు. NSA అజిత్ దోవల్‌తో 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల (SRs) చర్చలకు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి S జైశంకర్ (External Affairs Minister S Jaishankar) తో చర్చించారు.