Virat Kohli | రిటైర్‌మెంట్ ఆలోచ‌న‌లో విరాట్ కోహ్లీ.. రోహిత్ బాట‌లోనే న‌డుస్తున్నాడా?


అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli | టీమిండియాకి కీల‌క ఆట‌గాళ్లుగా ఉన్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ (Virat Kohli) కొద్ది రోజుల క్రితం టీ20 క్రికెట్‌కి గుడ్​బై చెప్పిన విష‌యం తెలిసిందే. వారిద్ద‌రూ ఉంటే జ‌ట్టు ఎంత ప‌టిష్టంగా ఉంటుందో మ‌న‌కు తెలుసు. కొన్ని కార‌ణాల వ‌ల‌న వారు ఒక్కో ఫార్మాట్‌కి రిటైర్మెంట్ అవుతూ వ‌స్తున్నారు. రెండ్రోజుల కిందట రోహిత్ శర్మ(Rohith Sharma) టెస్టు క్రికెట్‌కు గుడ్​బై చెప్పగా.. ఇప్పుడు అదే బాటలో రన్ మెషీన్ విరాట్ కోహ్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే విరాట్ తాను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు నేరుగా బీసీసీఐ(BCCI) వర్గాలకే వెల్లడించాడట.

Virat Kohli | షాకింగ్ నిర్ణ‌యం..

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు త్వరలో సమావేశం కానున్నారు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆ సిరీ‌స్‌లో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. అందుకే తాను రిటైర్‌మెంట్(Retirement) తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. ఇంగ్లండ్ టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లి రిటైర్మెంట్ బీసీసీఐ BCCI సెలక్టర్లను పెద్ద ఇర‌కాటంలో పెట్టిన‌ట్టు అయింది.

సెల‌క్ట‌ర్స్ ఓ సారి విరాట్‌ని ఆలోచించుకోమ‌ని చెప్పార‌ట‌. విరాట్ కోహ్లి(Virat Kohli) తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. ఇంగ్లండ్ టూర్‌లో భారత్ భంగపాటు కలగడం ఖాయం. రోహిత్ శర్మ రిటైర్​మెంట్​ Retirement ప్రకటించిన తర్వాత కెప్టెన్‌గా కోహ్లిని నియమించాలని కూడా బీసీసీఐ(BCCI) చూసింది. కానీ కోహ్లి సడెన్ డెసిషన్‌తో బీసీసీఐతో పాటు క్రికెట్ లోకం కూడా నివ్వెర‌పోవ‌డం ఖాయం. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ లాగే కోహ్లీ కూడా అతి చిన్న ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు క్రికెట్ అభిమానులు రోకో (రోహిత్, కోహ్లీ) జంటను వన్డేల్లో మాత్రమే ఆడడం చూడొచ్చు. వారిద్దరూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్(IPL Cricket) ఆడుతున్నారు. కానీ, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది.