ACB Trap
ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఈ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం భయపడటం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు.

కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు అందరి దగ్గర డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా పంచాయతీ రాజ్​ ఏఈఈ (PR AEE) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

పంచాయతీరాజ్​ శాఖ జగిత్యాల (Jagityala) సబ్​ డివిజన్​ కార్యాలయంలో సంగెం అనిల్​ కుమార్​ ఏఈఈ (విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్)గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి చేపట్టిన పనుల నాణ్యతను తనిఖీ చేసి, నివేదిక ఇవ్వడానికి ఏఈఈ రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు. అందులో ఇప్పటికే రూ.మూడు వేలు తీసుకున్నాడు.

అయితే బాధితుడు ఏసీబీ అధికారులకు (ACB Officers) ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఏఈఈ అనిల్​కుమార్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఆయనను అరెస్ట్​ చేశారు.

ACB Trap | పైసలు ఇస్తేనే బిల్లులు

గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టిన వారి నుంచి పంచాయతీ రాజ్​ ఉద్యోగులు భారీగా డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వడానికి, బిల్లులు చెల్లించడానికి లంచం అడుగుతారనే విమర్శలు ఉన్నాయి. పనులకు సంబంధించి పర్సంటేజీ ఇస్తేనే కొందరు అధికారులు బిల్లులు మంజూరు చేస్తారని సమాచారం.

ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.