అక్షరటుడే, కామారెడ్డి: Home Guard suspension | విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ పోలీసు శాఖకు (Kamareddy police) మచ్చ తెచ్చేలా పనిచేస్తున్న సిబ్బందిపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) కొరడా ఝులిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న ఓ హోంగార్డును సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే మరొక హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేశారు.
Home Guard suspension | పిట్లం పోలీస్స్టేషన్లో..
పిట్లం పోలీస్ స్టేషన్లో (Pitlam police station) పెట్రోకార్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు సాయాగౌడ్ జూదం ఆడే వారితో అనుచిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. జూదం స్థావరాలపై పోలీసుల దాడుల సమాచారాన్ని ముందుగానే పేకాట ఆడేవారికి చేరవేస్తున్నాడు.
ఈ విషయం ఉన్నతాధికారుల విచారణలో తేలింది. పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన హోంగార్డు సాయాగౌడ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేసారు. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ తప్పితే సిబ్బందిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

