అక్షరటుడే, ఇందూరు: Food Safety Department | నగరంలోని పలు రెస్టారెంట్లలో నిషేధిత ఉప్పు, సింథటిక్ ఆహార రంగులు వాడుతున్నట్లుగా గుర్తించామని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత (District Food Safety Officer Sunitha) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని రెస్టారెంట్లు (restaurants) సరైన పరిశుభ్రత పాటించకపోవడం గమనించామన్నారు. ప్రధానంగా హానికర రంగులు వాడడం, పచ్చిమాంసం నిల్వ ఉన్న ఫ్రీజర్స్ ఉష్ణోగ్రతలు సరిగ్గా మెయింటెన్ చేయడం లేదన్నారు. దీంతో మాంసం కుళ్లిపోయే స్థితికి చేరుతోందన్నారు.
Food Safety Department | పలు హోటళ్లకు నోటీసులు జారీ..
కల్తీ ఆహారాన్ని (adulterated food) గుర్తించిన హోటళ్లకు నోటీసులు జారీ చేశామని జిల్లా ఆహార భద్రత అధికారి తెలిపారు. అనుమానం వచ్చిన శాంపిళ్లను సేకరించి, రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. నివేదికలు వచ్చాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెస్టారెంట్ నిర్వాహకులు పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
