- Advertisement -
HomeతెలంగాణBar Fraud | బార్‌లో కల్తీ మద్యం.. ఎక్కడో తెలుసా..!

Bar Fraud | బార్‌లో కల్తీ మద్యం.. ఎక్కడో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bar Fraud | సమ్మర్‌ Summar వచ్చిందంటే మందుబాబులకు చల్లని బీరు Cold beer తాగకుండే మనసు కుదుటపడదు. ఐస్‌ క్యూబ్‌ Ice cube తో రెండు పెగ్గులు వేస్తే కానీ రిలాక్స్‌ అనిపించదు. కాస్త ఖరీదైన మద్యం దొరికితే ఓ పెగ్గు ఎక్కువే తీసుకుంటారు. కాగా.. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేస్తుంటారు. అయితే మందుబాబులకు ఓ బార్‌ నిర్వాహకులు Bar managers షాకింగ్‌ లాంటి ఘటన చవిచూపించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని Hyderabad  కూకట్‌పల్లిలో Kukatpally గల ఓ బార్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన పలువురికి అనుకోని ఘటన ఎదురైంది. ఖరీదైన మద్యం కొనుగోలు చేసుకొని తాగిన వారికి అనుమానం వచ్చి ఆరాతీయగా షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. ఖరీదైన మద్యం సీసాల్లో చీప్‌లిక్కర్‌ Cheap Liquor పోసి విక్రయిస్తున్నట్లు బయటపడింది. లింగంపల్లి Lingampalli ఎక్సైజ్‌ స్టేషన్‌ Excise station పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్‌ బార్‌లో Troop Bar జేమ్సన్‌ మద్యం Jameson liquor సీసాలో ఓక్‌స్మిత్‌ Oaksmith మద్యాన్ని కలిపి విక్రయించినట్లు గుర్తించారు. సగానికి పైగా ధర తక్కువ ఉన్న చీప్‌లిక్కర్‌ను ఖరీదైన వాటిల్లో కలిపి మోసగిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. పైగా బార్‌కు ఎలాంటి అనుమతులు లేవని, ఫీజులు కూడా చెల్లించలేదని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.

- Advertisement -

Bar Fraud | బార్‌ సీజ్‌ చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు తేలడంతో సదరు బార్‌ను సీజ్‌ చేశారు. అలాగే 1.50 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు ప్రకటించారు. ఆఖరకు మద్యం కూడా కల్తీచేసి విక్రయించడం మందుబాబుల్లో చర్చకు దారితీసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News