అక్షరటుడే, ఎల్లారెడ్డి: Taekwondo sports | తైక్వాండోలో అద్భుతాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ క్రీడాకారిణి. ప్రతిభ ఉంటే వయస్సులో సంబంధం లేకుండా విజయాలు సాధించవచ్చని నిరూపిస్తోంది.
Taekwondo sports | ఇంద్రాణి స్కూల్ విద్యార్ధిని..
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట(nagireddy pet) మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్ గౌడ్, నీరజ కుమార్తె ఆద్రితి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాణి స్కూల్లో (Indrani school) రెండో తరగతి చదువుతోంది. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు.. వారి ఆత్మ సంరక్షణ చేసుకునేందుకు తండ్రి అశోక్ గౌడ్ చిన్నతనం నుండే తైక్వాండోలో తన కూతురికి శిక్షణనిప్పిస్తున్నారు. ఆద్రితి సైతం తన మాస్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ పలు జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపుతోంది.
Taekwondo sports | గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో..
గచ్చిబౌలిలో నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ కేటగిరి 20 కిలోల విభాగంలో ఆద్రితి ప్రతిభ చూపింది. తన ప్రతిభతో పంచ్‌లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన చిన్నారిని తెలంగాణ తెక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అభినందించారు. చిన్నారి రాష్ట్రస్థాయిలో రాణించడంపై తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.