అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ఆదివాసీ నాయక్‌పోడ్ జిల్లా సేవా సంఘం (Adivasi Naikpod District Service Associatio) కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గాండ్ల రాంచందర్, ప్రధానకార్యదర్శిగా పుట్ట శివ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కావాల్కడి పోశెట్టి, కోశాధికారిగా శానం పవన్ కుమార్, అధికార ప్రతినిధిగా పుట్ట దుర్గ మల్లేష్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Nizamabad City | ప్రజాప్రతినిధుల ఫోరం ఎన్నిక
జిల్లాలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు (Sarpanches), ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లతో (ward members) ఆదివాసీ నాయక్‌పోడ్ జిల్లా ప్రజాప్రతినిధుల ఫోరంను కూడా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎర్రం శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాత్రికి అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుంకరి రాజు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాలను ఆదివాసి నాయక్‌పోడ్ సంఘం సభ్యులు సన్మానించారు.