67
అక్షరటుడే, ఇందూరు: additional collector : తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ (TGTA), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) క్యాలెండర్, డైరీలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శనివారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
additional collector : ప్రజలకు అందుబాటులో..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీటీఏ (TGTA) జిల్లా అధ్యక్షుడు శేఖర్, తహశీల్దార్, TGRSA జిల్లా అధ్యక్షుడు బి. దేవిసింగ్, జిల్లా జీపీవో (Gpo) నాయకులు పృథ్వీ, కిషన్ గౌడ్, గంగాధర్, ప్రశాంత్, అశోక్, శ్రీనివాస్, లక్షణ్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.