అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రజలకు సంబంధించిన మౌళిక వసతుల కల్పనకు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. బోధన్ మున్సిపాలిటీ(Bodhan Municipality)లో సోమవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపై సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Sub-Collector Vikas Mahato) సమీక్ష నిర్వహించారు.
Bodhan | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై..
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) నిర్మాణాల పురోగతిపై అడిషనల్ కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలో నిర్మించిన కల్వర్టుల నాణ్యతపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు హితవు పలికారు. రివ్యూలో మున్సిపల్ కమిషనర్ కృష్ణజాదవ్ తదితరులు పాల్గొన్నారు.