అక్షరటుడే, బోధన్ : Bodhan | వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ముంపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు.
దీంట్లో భాగంగా బోధన్ మండలం హంగర్గ గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) మంగళవారం పరిశీలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామాన్ని సందర్శించి బ్యాక్‌వాటర్ ప్రవాహాన్ని (Backwater Flow) పరిశీలించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తహశీల్దార్ విఠల్‌కు (Tahsildar Vitthal) సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. వరద ఉధృతి పెరిగితే గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు.