అక్షర టుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు (state-level kabaddi competitions) ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మహేందర్ తెలిపారు.
పాఠశాలకు చెందిన విద్యార్థులు మహేందర్ (వాలీబాల్), ఉషిత, అరవింద్, ప్రకాశ్, విజయ్ సింగ్, రూపేశ్వర్, దీప్‌సింగ్ (కబడ్డీ) ఎల్లారెడ్డి జోన్ (Yella Reddy Zone) స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. అలాగే అరవింద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.