Homeబిజినెస్​adani group | అదానీపై కుట్ర‌ల వెనుక రాహుల్‌గాంధీ.. ఇజ్రాయిల్ నిఘా సంస్థ విచార‌ణ‌లో వెలుగులోకి..

adani group | అదానీపై కుట్ర‌ల వెనుక రాహుల్‌గాంధీ.. ఇజ్రాయిల్ నిఘా సంస్థ విచార‌ణ‌లో వెలుగులోకి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: adani group | ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌత‌మ్ అదానీ(Gautam adani)కి చెందిన‌ అదానీ గ్రూప్(adani group) సంస్థ‌ల‌పై హిండెన్‌బ‌ర్గ్(Hindenburg) చేసిన ఆరోప‌ణ‌ల వెనుక కాంగ్రెస్ హ‌స్తం ఉన్న‌ట్లు ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొస్సాద్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్‌ అధ్య‌క్షుడు శ్యామ్ పిట్రోడా(sham pitroda) క‌లిసి ఈ కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని వెల్ల‌డించింది. పిట్రోడా హోమ్ స‌ర్వ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మొస్సాద్(Mossad) చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌లో ఈ విషయం వెలుగు చూసిందని స్పుత్నిక్ ఇండియా త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.

adani group | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు

అమెరికా కేంద్రంగా ప‌ని చేసే షార్ట్ సెల్లింగ్(short selling) సంస్థ హిండెన్‌బ‌ర్గ్(Hindenburg) 2023 జ‌న‌రిలో అదానీ సంస్థ‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అదానీ గ్రూప్‌లో స్టాక్ మానిప్యులేష‌న్ జ‌రుగుతోంద‌ని, అకౌంటింగ్ మోసాలు జ‌రుగుతున్నాయ‌ని, అనూహ్యంగా విలువ పెంచుకుంటూ పోతున్నార‌ని హిండెన్‌బ‌ర్గ్ ఆరోపించింది. దీంతో ఆదానీ స్టాక్స్(adani stocks) కుప్ప‌కూలాయి. ఇన్వెస్ట‌ర్లు పెద్ద మొత్తంలో న‌ష్ట‌పోగా, షార్ట్ సెల్లింగ్‌తో హిండెన్‌బ‌ర్గ్ భారీగా లాభాలు ఆర్జించింది. అదానీ గ్రూప్‌(adani group)పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ద‌ర్యాప్తు చేప‌ట్టిన సెబీ(Sebi) హిండెన్‌బ‌ర్గ్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చింది. మ‌రోవైపు, ఆ సంస్థ‌పై విచార‌ణ జ‌ర‌పాలంటూ కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. కానీ కొద్దిరోజుల‌కే హిండెన్‌బ‌ర్గ్ త‌న కార్య‌కలాపాల‌ను మూసేసింది.

adani group | మోదీ, అదానీ ల‌క్ష్యంగానే కుట్ర‌..

అయితే, హిండెన్‌బ‌ర్గ్(Hindenburg) ఆరోప‌ణ‌ల వెనుక ఎవ‌రున్నార‌నేది గుర్తించేందుకు ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా సంస్థ మొస్సాద్(Mossad) ర‌హ‌స్య ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పిట్రోడాకు చెందిన ఐవోసీ హోం స‌ర్వ‌ర్ల‌లోకి చొచ్చుకెళ్లిన నిఘా సంస్థ‌.. ఎన్‌క్రిప్టెడ్ చాట్‌రూమ్‌లు, బ‌హిర్గ‌తం చేయ‌ని క‌మ్యూనికేష‌న్ బ్యాక్ చాన‌ల్‌ను సైతం ఛేదించింది. ఈ నేప‌థ్యంలోనే గౌత‌మ్ అదానీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(Pm modi)ని అణ‌గ‌దొక్కాల‌నే ల‌క్ష్యంతో రాహుల్‌గాంధీ(Rahul gandhi), హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ బృందం చేసిన కుట్ర బ‌య‌టకు వ‌చ్చింద‌ని స్పుత్నిక్ ఇండియా వెల్ల‌డించింది.