అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Adah Sharma | విలక్షణమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అదా శర్మ (Adah Sharma). ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలతో తాజాగా వార్తల్లో నిలిచారు. 2023లో విడుదలైన సినిమా “ది కేరళ స్టోరీ” దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.
ఈ సినిమా తర్వాత తన జీవితం, కెరీర్‌లో జరిగిన మార్పుల గురించి అదా తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.అదా మాట్లాడుతూ.. “రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు నిజమైన విలువ వస్తుంది. నా సినీ ప్రయాణం ‘1920’ సినిమాతో ప్రారంభమైంది. అది నా తొలి చిత్రం అయినప్పటికీ, చాలా సాహసోపేతమైనది. ‘ది కేరళ స్టోరీ’ విడుదలయ్యే వరకు సరైన కథ కోసం ఎదురు చూశాను. ఆ సినిమా తర్వాత నా జీవితం, కెరీర్ రెండూ మారిపోయాయి అని పేర్కొంది.
Actress Adah Sharma | చంపాలనుకున్నారు..
అదే కాకుండా ఆ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా అదా శర్మ వెల్లడించారు . ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) విడుదల సమయంలో నాకు తీవ్రంగా బెదిరింపులు వచ్చాయి. దేశంలోని సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు, మిగతా సగం మంది మాత్రం నాపై ప్రేమ, మద్దతు, ప్రశంసలు కురిపించారు. వారే నన్ను రక్షించారు. ఆ తరువాత చేసిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ (Bastar: The Naxal Story)కూడా నాకు పెద్ద మైలురాయిగా నిలిచింది,” అని అదా చెప్పింది. “పాత్రలో భావోద్వేగం లేకపోతే అది నాకు నచ్చదు. యాక్షన్ సన్నివేశాలు ఉండాలి. అలాగే, నేను డీహైడ్రేట్ అయ్యేంతగా ఏడ్చే సన్నివేశాలు ఉంటేనే ఆసక్తి కలుగుతుంది. తేలికపాటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. నేను చేసే పాత్రలు చూసి నా కుటుంబం కొన్నిసార్లు ఆందోళన చెందుతుంటుంది,” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అదా శర్మ పలు బలమైన కథా నేపథ్యాలున్న కొత్త ప్రాజెక్టుల్లో నటిస్తోంది. కఠినమైన పాత్రలు, లోతైన భావోద్వేగాలు ఇవే తన సినీ ప్రయాణాన్ని నిర్వచిస్తున్నాయని ఆమె చెబుతోంది. అదా శర్మ గతంలో పలు తెలుగు చిత్రాలలోను నటించి మెప్పించింది. ఈ అమ్మడు సోషల్ మీడియా (Social Media)లోను చాలా చురుకుగా ఉంటుంది.
