ePaper
More
    HomeసినిమాRanya Rao | గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావుకు జైలుశిక్ష

    Ranya Rao | గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావుకు జైలుశిక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ranya Rao | బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు (Kannada actress Ranya Rao)కు ఏడాది జైలు శిక్ష పడింది. రన్యారావుతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి కూడా జైలు శిక్ష విధించారు. శిక్ష సమయంలో వారు బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో రన్యారావు ఏడాది పాటు జైలులోనే గడపాల్సి ఉంటుంది.

    కన్నడ నటి రన్యారావు కొంతకాలంగా బంగారం అక్రమంగా రవాణా (Gold Smuggling) చేస్తున్నారు. మార్చిలో దుబాయి నుంచి బంగారం అక్రమంగా తీసుకు వస్తుండగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (Bangalore International Airport)లో ఆమెను అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ విషయం అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసు విచారిస్తున్న విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు తాజాగా ఆమెకు జైలు శిక్ష విధించింది. ఆమెకు సహకరించిన తరుణ్‌ కొండారు రాజు, సాహిల్‌లకు కూడా ఏడాది జైలు శిక్ష విధించినట్లు తెలిపింది.

    READ ALSO  Harihara veeramallu review | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రివ్యూ.. యాక్ష‌న్ డ్రామా ఆక‌ట్టుకుందా?

    Ranya Rao | భారీగా ఆస్తుల జప్తు

    బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు రన్యారావు తరలిస్తున్న 14.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఈడీ అధికారులు(ED Officers) ఆమెపై కేసు నమోదు చేశారు. రన్యారావు ఇంట్లో సోదాలు చేసి, రూ.34.12 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this