ePaper
More
    HomeతెలంగాణActress Ramyashri | గచ్చిబౌలిలో దారుణం.. నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై కత్తులతో దాడి

    Actress Ramyashri | గచ్చిబౌలిలో దారుణం.. నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై కత్తులతో దాడి

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Actress Ramyashri : తెలంగాణ రాజధాని(Telangana capital)లో దారుణం చోటుచేసుకుంది. గచ్చిబౌలి(Gachibowli)లో సినీ నటి రమ్య శ్రీ(film actress Ramyashri), ఆమె సోదరుడిపై కొంతమంది దుండగులు పట్టపగలే కత్తులు, బ్యాట్ లతో దాడి చేశారు.

    హైదరాబాద్(Hyderabad) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station) దగ్గరలో ఉన్న ఎఫ్​సీఐ (FCI) కాలనీ లే అవుట్ లో మంగళవారం (జూన్​ 17) హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టింది. ఫ్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా(Hydraa) అధికారులు ఈ ప్రక్రియ చేపడుతుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్(Sandhya Convention) యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్ తో శ్రీధర్ రావు అనుచరులు దాడికి దిగినట్లుగా చెబుతున్నారు.

    Actress Ramyashri : ప్రభుత్వానికి విజ్ఙప్తి..

    ఈ క్రమంలో గాయాల పాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై హత్యాయత్నం చేసినట్లు రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

    టాలీవుడ్(Tollywood)​ నటి రమ్యశ్రీ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this