HomeUncategorizedActress Meera Mithun | త‌ప్పించుకుని తిరుగుతున్న హీరోయిన్.. ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేసిన పోలీసులు

Actress Meera Mithun | త‌ప్పించుకుని తిరుగుతున్న హీరోయిన్.. ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Actress Meera Mithun | కొంతమంది నటులు తమ నటనతో పేరు తెచ్చుకుంటారు. మరికొంతమంది గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. కానీ, కొంతమంది నటీమణులు మాత్రం వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. సినిమాల్లో కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు వాళ్లను మరింత పాపులర్ చేస్తుంటాయి.

అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు మీరా మిథున్. తమిళ సినీ పరిశ్రమలో మీరా మిథున్‌(Actress Meera Mithun)కి మంచి గుర్తింపు ఉంది. బిగ్‌బాస్ తమిళ్ షో(Bigg Boss Tamil Show)లో పాల్గొనడంతో పాటు, కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే సినిమాల కంటే ఆమె వివాదాలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. 2021లో ఆమె చేసిన కొన్ని కుల వివక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Actress Meera Mithun | ఎట్ట‌కేల‌కు చిక్కింది…

2021లో మీరా మిథున్ తన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో, షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటులు, నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. దీనిపై వన్నీ అరసు అనే రాజకీయ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, SC/ST అట్రాసిటీ చట్టం, 153, 153 ఎ (1) (ఎ), 505 (1) (బి), 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సమయంలో మీరాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన మీరా కేసు విచారణలకు హాజరు కాలేదు. దీంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అరెస్ట్ వారెంట్ జారీ (Arrest Warrant Issue) చేసింది.

అయితే మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న మీరాని ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్ట్ చేశారు. నా కుమార్తె ఢిల్లీ(Delhi)లో వీధుల్లో తిరుగుతోంది, ఆమెను కాపాడండి అంటూ మీరా త‌ల్లి చేసిన పిటిషన్‌కు కోర్టు స్పందించింది. ఈనెల 11న కోర్టులో హాజరుపరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులను (Chennai Central Crime Branch Officers) ఆదేశించింది. దీంతో చెన్నై లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలో ఉన్న లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి ఇచ్చి, ఢిల్లీ పోలీసుల (Delhi Police) సాయంతో ఆమెను గుర్తించి అక్క‌డున్న ప్ర‌భుత్వ హోంలో ఉంచిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.