అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Kalpika Ganesh | సినిమాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన నటి కల్పిక గణేష్ (Actress Kalpika Ganesh) మరోసారి వివాదంలో నిలిచింది. హైదరాబాద్ (Hyderabad) సమీపంలోని మొయినాబాద్- కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) చర్చనీయాంశంగా మారింది.
సోమవారం మధ్యాహ్నం క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్ వద్దే సిబ్బందిపై గొడవకు దిగారు. మేనేజర్ కృష్ణపై బూతుల వర్షం కురిపించడంతోపాటు, మెనూ కార్డు విసిరేయడం, తాళాలను పడేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆమె ప్రవర్తనకు అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ హంగామా కొనసాగింది.
Actress Kalpika Ganesh | ఇప్పుడు కొత్త వివాదం..
ఈ ఘటనపై కల్పిక స్పందిస్తూ, రిసార్ట్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్ సదుపాయం లేకపోవడం, వైఫై పనిచేయకపోవడం, సిగరెట్ తీసుకురావాలని అడిగినా పట్టించుకోకపోవడం నన్ను ఇబ్బందికి గురితీసిందని తెలిపారు.
“కస్టమర్‌గా వెళ్లినా కనీస గౌరవం లేదంటే బాధపడడం సహజం. అందుకే అలా స్పందించాల్సి వచ్చింది అంటూ ఆమె పేర్కొన్నారు. కల్పిక రిసార్ట్ సిబ్బందితో జరిగిన మాటల యుద్ధాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేశారు. అయితే, ఆమె మాటలు నెటిజన్లకు అంతగా నచ్చలేదు. “నీకు ఏదో మానసిక సమస్య ఉన్నట్లు ఉంది”, “ఊరికే గొడవలు చేసుకోవడం నీకు అలవాటేమో”, “ఇంట్లో ఉండడం బెటర్” అంటూ ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి.
ఇది కల్పిక గణేష్‌కు సంబంధించిన తొలి వివాదం కాదు. రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రిజమ్ పబ్‌లో (Hyderabad Prism Pub) జరిగిన ఘర్షణ తర్వాత ఆమెపై కేసు కూడా నమోదైంది. అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆమె ప్లేట్లు విసిరినట్లు, బాడీ షేమింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు ఆమె .. పబ్ సిబ్బంది తన్ను డ్రగ్ అడిక్ట్‌గా అభివర్ణించడం, అవమానించడమే గొడవకు కారణమైంది అని వివరణ ఇచ్చారు. ఇలా వరుసగా పబ్, రిసార్ట్‌లలో కల్పిక ప్రవర్తనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె మానసికంగా సమస్యల్లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె ప్రవర్తనను “పబ్లిసిటీ స్టంట్”గా అభివర్ణిస్తున్నారు.