అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hari Hara Veeramallu | సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. వారి లుక్స్, డ్రెసింగ్ స్టైల్, యాటిట్యూడ్, హెయిర్ స్టైల్‌ను ఇమిటేట్ చేయడం, అభిమాన హీరో పేరు లేదా సినిమా టైటిల్‌తో టాటూ వేయించుకోవడం వంటి చర్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఒక నటి చేసిన కామెంట్లు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ‘‘ఇది ప్రేమ కాదు పిచ్చి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నటి నివేతా మనోజ్ (Actress Nivetha Manoj) ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. సక్సెస్ మీట్లో పవన్ (Pawan) పాదాలకు నమస్కరించి ఆయనతో ఫొటో దిగిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టేజ్ మీదే ఎగిరి గంతులేయడంతో వార్తల్లోకి ఎక్కేసింది.
Hari Hara Veeramallu | మరీ ఇంత పిచ్చా..
పవన్‌తో ఫొటో దిగాక నివేథా ఎగిరి గంతేసిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ ముక్కుకి పెట్టుకున్న మాస్క్ నేను పెట్టుకున్నాను… ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్ అంటే నాకు ప్రాణం..’’ అని ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. సక్సెస్ మీట్లో (success meet) పవన్ తాగి పడేసిన వాటర్ బాటిల్‌ను దాచుకున్న నివేతా.. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా దానిని వెంట తీసుకెళ్తోంది. ఆయనతో ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా చాలని ఆమె చెప్పడం గమనార్హం.
పవన్ కళ్యాణ్‌తో పాటే 35 రోజులపాటు హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) షూటింగ్లో పాల్గొన్నానని చెప్పిన నివేత ‘‘ప్రతీరోజూ సెట్స్‌లో పవన్‌ను చూస్తూనే ఉండేదాన్ని. ఆయనతో మాట్లాడకపోయినా కూడా తాను పీల్చిన గాలిని నేను పీల్చాను. ఆయన స్మెల్ చేసిన ఇసుకను తానూ స్మెల్ చేసినట్టు పేర్కొంది. అంతేకాదు పవన్ కల్యాణ్‌కు వాటర్ ఇచ్చిన ప్రొడక్షన్ బాయ్ తనకూ వాటర్ ఇవ్వడంతో మురిపోయేదాన్నని’’ నివేతా చెప్పింది. దీన్ని పిచ్చి అనుకుంటే అలానే అనుకోండని నివేతా పేర్కొంది.