అక్షరటుడే, వెబ్‌డెస్క్: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ మోహన్, ప్రదీప్ కలిసి మలేసియాలోని కౌలాలంపూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మురళీ మోహన్ Murali Mohan, ప్రదీప్ Pradeep ను సన్మానించారు. అనంతరం ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు.
Malaysia Telugu people : విందుకు హాజరైన వారిలో..
ఈ విందుకు స్థానిక ఎన్ఆర్‌ఐ సంఘాల ప్రతినిధులు, TEAM (తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్) కోశాధికారి డాక్టర్ నాగరాజు సూర్యదేవర, FNCA-Malaysia (ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్ – మలేసియా) అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, BAM (భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా) ప్రెసిడెంట్ సత్య, MYTA (మలేసియా తెలంగాణ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఇతర ప్రముఖ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మలేసియాలోని భారతీయ ప్రవాసుల జీవన పరిస్థితులపై చర్చించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, వారికి ఎదురవుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు.