అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Mukul Dev | ఇటీవల ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే కొందరు నటీనటులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా హిందీ సినీ పరిశ్రమలో (Hindi film industry) విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) (Actor Mukul Dev) కన్నుమూశారు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘జై హో’ వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను (Bollywood circles) దిగ్భ్రాంతికి గురిచేసింది. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ (actress Deepshikha Nagpal) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ముకుల్ దేవ్ (Mukul Dev) మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని సమాచారం.
Actor Mukul Dev | నివాళులు..
‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్ రాజ్ కుమార్’, ‘జై హో’ వంటి పలు హిందీ చిత్రాలలో (Hindi Movies) ముకుల్ దేవ్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ చిత్రాలలో (Punjabi movies) కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాతో (Prabhas Ek niranjan movie) పాటు రవితేజ (Ravi teja) నటించిన కృష్ణ సినిమాలో కీలక పాత్రల్లో మెరిశాడు ముకుల్. చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ చిత్రంలో కనిపించిన ముకుల్ దేవ్, బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌కి సోదరుడు. ముకుల్ దేవ్ చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ సినిమాలో కనిపించారు. న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా (Assistant Commissioner of Police) పనిచేశారు. ఆయన ద్వారానే ముకుల్ దేవ్‌కు ఆఫ్ఘన్ సంస్కృతి పరిచయమైంది.
ఆయన తండ్రి పష్తో, పర్షియన్ భాషలు మాట్లాడగలిగేవారు. అంతేకాకుండా, ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ (Indira Gandhi Rashtriya Uran Academy) నుంచి పైలట్‌గా కూడా శిక్షణ పొందారు. నటనపై ఆసక్తితో ముకుల్ దేవ్ ఎనిమిదో తరగతిలోనే తొలి పారితోషికం అందుకున్నారు. దూరదర్శన్ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌ను అనుకరించి ఆయన ఈ గుర్తింపు పొందారు. 1996లో ‘ముమ్కిన్’ అనే టెలివిజన్ సీరియల్లో విజయ్ పాండే (Vijay Pandey) పాత్రతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఏక్ సే బధ్ కర్ ఏక్’ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో (comedy Bollywood countdown show) కూడా ఆయన నటించారు. ‘ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా’ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే, ‘దస్తక్’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటించారు. ఈ చిత్రంతోనే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.