ePaper
More
    HomeసినిమాFish Venkat | టాలీవుడ్​లో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

    Fish Venkat | టాలీవుడ్​లో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Fish Venkat : టాలీవుడ్​(Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. విలన్, తండ్రి పాత్రలతోపాటు వెండితెర(silver screen)పై హాస్యాన్ని పండించిన కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇటీవలే మరణించారు. తాజాగా మరో హాస్య నటుడు కన్నుమూశారు. నటుడుమంగిలంపల్లి వెంకటేశ్‌ (54) (ఫిష్ వెంకట్) శుక్రవారం రాత్రి (జులై 18) కన్నుమూశారు.

    తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)లో ఎన్నో చిత్రాల్లో విలన్​, కామెడీ పాత్రలతో అలరించిన నటుడు ఫిష్​ వెంకట్​ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వెంకట్​ రెండు కిడ్నీలు కూడా పాడయ్యాయి. దీంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని చందానగర్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    Fish Venkat : దాతల సాయం..

    వెంకట్‌ చికిత్స కోసం ఎందరో దాతలు విరాళాలు అందించారు. సినీ ప్రముఖులెందరో (film celebrities) సాయం అందించారు. వారి సహాయంతో ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. కాగా, ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో కొద్ది రోజులుగా వెంటిలేటర్​పైనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మృతి చెందారు.

    Fish Venkat : నటుడు శ్రీహరి ద్వారా పరిచయం..

    ఫిష్​ వెంకట్​ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్(MangalamPalli Venkatesh)​. ముషీరాబాద్​లో ఉండేవారు. నటుడు శ్రీహరి ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

    Fish Venkat : ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..

    మంగలంపల్లి వెంకటేశ్​ ముషీరాబాద్‌  (Musheerabad) మార్కెట్‌లో చేపల వ్యాపారం చేసేవారు. అందుకే ఆయనకు ఫిష్‌ వెంకట్‌ పేరు వచ్చింది. వెంకట్​ను డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ నటుడిగా వెండితెరపై పరిచయం చేశారు. ఆది, దిల్‌, బన్ని, గబ్బర్​సింగ్, కింగ్ తదితర సూపర్​ హిట్‌ సినిమాల్లో నటించారు. హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

    More like this

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....