అక్షరటుడే, భీమ్గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.
మండలంలోని గోన్ గొప్పుల (Gongoppula) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను (congress Government) ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త భుజంపై ఉందన్నారు. అలా చేసినప్పుడే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.
పార్టీలో చేరిన వారిలో కొత్తూర్ రాజాగౌడ్, కుమ్మరి రాజన్న, కుమ్మరి బాలయ్య, బంగ్లా నర్సయ్య, బండారి సూర్యదాసు, మిట్టపల్లి నర్సయ్య, కొమ్ము నవీన్, శ్రీహరి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.