అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | చిరు వ్యాపారులు, తోపుడుబండ్లు (Carts) రోడ్లపై నిలిపి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) సూచించారు. శనివారం గాంధీచౌక్ (Gandhi Chowk), గంజ్‌గేట్-1(Gunj Gate), దేవి రోడ్‌లో గల దుకాణాల యజమానులు, తోపుడు బండ్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దుకాణదారులు రోడ్లను ఆక్రమించేలా తమ సామగ్రి పెట్టవద్దన్నారు. వాహనాలను ఇష్టారీతిన రోడ్లపై నిలిపి ఉంచవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
