ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | అసెంబ్లీలో చర్చించి కాళేశ్వరం నివేదికపై చర్యలు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక...

    CM Revanth Reddy | అసెంబ్లీలో చర్చించి కాళేశ్వరం నివేదికపై చర్యలు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : CM Revanth Reddy | కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. కమిషన్​ నివేదికపై మంత్రివర్గంలో (Cabinet Meeting) చర్చ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో అక్రమాలకు, కుంగిపోవడానికి నాటి సీఎం కేసీఆర్ (Former CM KCR)​ కారణమని కమిషన్​ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చించి భవిష్యత్​ కార్యాచరణ చేపడతామని సీఎం తెలిపారు.

    కాంగ్రెస్​ హయాంలో 2007లో ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రాజెక్ట్​ రీ డిజైన్​ పేరిట కేసీఆర్ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించారన్నారు. దాని నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి తెలంగాణకు సాగునీటి వసతులు కల్పిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మించారన్నారు.

    CM Revanth Reddy | మూడేళ్లకే కుంగిపోయింది

    నిర్మాణం జరిగిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిందని సీఎం తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు పగళ్లు వచ్చాయన్నారు. ప్రాజెక్ట్​లు ప్రమాదంలో పడ్డాయని ఎన్​డీఎస్​ఏ (NDSA), సాంకేతిక నిపుణులు చెప్పారన్నారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ లోపాలతో ప్రాజెక్ట్​లు కుంగిపోయాయన్నారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తాను రాహుల్​గాంధీతో కలిసి ప్రాజెక్ట్​లను పరిశీలించినట్లు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని మాట ఇచ్చామని చెప్పారు. ఈ మేరకు పీసీ ఘోష్​ ఛైర్మన్​గా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.

    CM Revanth Reddy | పేరు మార్చి.. అవినీతి

    ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి, రీ డిజైన్​ పేరిట బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని సీఎం పేర్కొన్నారు. పేరు మార్చి.. స్థలాన్ని మార్చి అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ కూలిపోయిందన్నారు. దీనికి బాధ్యులైన వారి వివరాలను కమిషన్​ తన నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. ఈ నివేదికను మంత్రివర్గంలో ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ పెడతామన్నారు. అనంతరం కమిషన్​ సూచనలు అమలు చేస్తామని, భవిష్యత్​ కార్యాచరణ వెల్లడిస్తామని సీఎం తెలిపారు.

    Latest articles

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this