అక్షరటుడే, ఇందూరు: Meeseva Centers | నగరంలోని మీసేవ కేంద్రాల్లో నిర్వాహకులు అదనంగా రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాజేంద్రకుమార్ (RDO Rajendra kumar) తెలిపారు.
Meeseva Centers | ఫిర్యాదులు వస్తే చర్యలు..
శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో (Ambedkar Bhavan) మీసేవ సెంటర్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవ కేంద్రంలో ధరల పట్టిక ప్రకారం రుసుము తీసుకోవాలని, అదనంగా తీసుకున్నట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవన్నారు.
దరఖాస్తులు స్వీకరించిన సమయంలో అన్ని దస్తావేజులు, పత్రాలను పరిశీలించి అప్లోడ్ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల (Ration Cards) ఇప్పిస్తానని మోసం చేసే మధ్యవర్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ తహశీల్దార్లు విజయకాంత్ రావు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
