అక్షరటుడే, ఇందూరు: Actions Against Scanning Centers | నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
Actions Against Scanning Centers | ప్రమాణాలు పాటిస్తూ..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు (Scanning centers) మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కేంద్ర నిర్వాహకులు రికార్డులను, రిపోర్ట్‌లను క్రమం తప్పకుండా నమోదు చేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయవద్దని అధికారులను ఆదేశించారు.
పీసీపీ ఎన్డీటీ చట్టంపై అవగాహన..
పీసీపీ ఎన్డీటీ చట్టంపై (PCP NDT Act) విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, పీవో సుప్రియ, శిఖర, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, సమత, రెడ్‌క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.