అక్షరటుడే, నిజామాబాద్: Nizamabad deo office | నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో (Nizamabad district education department) అంతులేని అవినీతి జరుగుతోంది. ప్రత్యేకించి పలు విభాగాలు, సిబ్బంది రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్ల రెన్యూవళ్ల కోసం ముక్కుపిండి మరీ యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సొంత కార్యాలయంలో ఇంత జరుగుతున్నప్పటికీ డీఈవో అశోక్ (DEO Ashok) పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా.. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
జిల్లా విద్యాశాఖాధికారిగా అశోక్ (District Education Officer) బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యాలయం చక్కబడుతుందని అంతా భావించారు. ప్రత్యేకించి గత అధికారి హయాంలో అవినీతికి (corruption) పాల్పడిన వారికి చెక్ పెడతారని.. పూర్తి ప్రక్షాళన చేస్తారని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా డీఈవో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకపోయిన్పటికీ కిందిస్థాయి అధికారులు (lower-level officers), సిబ్బంది మాత్రం చేయితడపనిదే ఏ పని చేయట్లేదు. ఒక్కో దస్త్రానికి ఒక్కో రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు.
Nizamabad deo office | గతంలో రూ.పదివేలు.. ప్రస్తుతం రూ.లక్ష..!
తాజాగా.. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు (private school) సంబంధించిన రెన్యూవల్ దస్త్రం డీఈవో వద్దకు వెళ్లింది. కాగా.. ఆ ఫైల్‌ను పరిశీలించిన డీఈవో పలు కొర్రీలు పెట్టి వెనక్కి పంపారు. ఆ తర్వాత సదరు పాఠశాల యాజమాన్యం పలు ప్రయత్నాలు చేసి నిబంధనల మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి అనుమతి కోసం రీఅప్లికేషన్ చేసుకుంది. తదనంతరం రెన్యూవల్ పూర్తయింది. ఇదే అదునుగా ‘‘డీఈవో స్ట్రిక్ట్‌గా ఉన్నారు’’.. అని సాకుతో కార్యాలయ సెక్షన్ అధికారులు, సిబ్బంది రూ. లక్ష వరకు వసూలు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇదే పనికోసం తాము గతంలో రూ. పది వేలు చెల్లించామని.. ఇప్పుడు రూ. లక్ష సమర్పించుకోవాల్సి వచ్చిందని సదరు పాఠశాల యాజమాన్యం (school management) మొరపెట్టుకుంది. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలల ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Nizamabad deo office | సొంత వారిపై చర్యలేవి..!
డీఈవో నిరంతరం తన పర్యవేక్షలో ఉండే డీఈవో కార్యాలయంలో ఈ పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వస్తున్నాయి. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా.. వారిని కట్టడి చేయలేకపోతున్నారు. ఇకనైనా జిల్లా విద్యాధికారి (District Education Officer) దృష్టి సారించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.