అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి (Kamareddy), రాజంపేట(Rajampet) మండలాల్లో పోలింగ్ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. చిన్న మల్లారెడ్డి, రాజంపేట పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.
SP Rajesh Chandra | గట్టి నిఘా పెట్టాలి..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల (Polling stations) వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడాన్ని నిరోధించాలని ఎస్పీ సూచించారు. బెదిరింపులు లేదా ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలో తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సున్నితమైన, అధిక ప్రాధాన్యత కలిగిన పోలింగ్ కేంద్రాల్లో అదనపు సిబ్బంది నియమించామని తెలిపారు.
అందరు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో అమల్లో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ప్రజలు పూర్తిగా నమ్మకంగా, భయభ్రాంతులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎస్సైలు ఉన్నారు.