ePaper
More
    HomeతెలంగాణCongress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఛైర్మన్​ మల్లు రవి (Mallu Ravi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    కొంతకాలంగా సీఎం రేవంత్​రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి (Raja Gopal Reddy) విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యవహారంపై చర్చించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. అయితే ఆదివారం సమావేశంలో రాజగోపాల్​రెడ్డి అంశంపై చాలా సేపు చర్చించినట్లు మల్లు రవి తెలిపారు. సమస్య పునరావృతం కాకుండా ఒకసారి చెప్పి చూస్తామని.. అయినా వినకుంటే ఆయనపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    Congress | కమిటీల ఏర్పాటు

    వరంగల్​ కాంగ్రెస్​లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి (Konda Murali) మిగతా ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఈ క్రమంలో ఇటీవల మురళితో క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. తాజాగా వరంగల్​ జిల్లా నేతల సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై పీసీసీ లేఖ రాసినట్లు మల్లు రవి తెలిపారు. అలాగే ఇటీవల గజ్వేల్​లో మంత్రి వివేక్​ పాల్గొన్న కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు దాడులు చేసుకున్నారు. గజ్వేల్​లో నర్సారెడ్డి దాడి చేశారని ఫిర్యాదు వచ్చిందని మల్లు రవి తెలిపారు. ఈ విషయం గురించి నలుగురితో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛైర్మన్​గా శ్యామ్ మోహన్​ను నియమించామని, ఈ కమిటీ పది రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు.

    Congress | వచ్చే వారం సమావేశం

    వరంగల్​లో (Warangal) రెండు వర్గాల నాయకులతో కమిటీ చర్చించనున్నట్లు మల్లు రవి తెలిపారు. గజ్వేల్ (Gajwel) అంశంపై సైతం నివేదిక వచ్చాక వచ్చే వారం మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటిపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. తనది మంటలు ఆర్పే పని అని, మంటలు పెట్టే పని కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్​లో విభేదాలు సరి చేస్తూ, అందరూ కలిసి పని చేసేలా చూస్తానన్నారు. ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదని మల్లు రవి హెచ్చరించారు. మంత్రి పదవి విషయంలో రాజోపాల్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. దీనిపైన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు వచ్చాక వచ్చేవారం ఆయన వ్యవహారంపై చర్చిస్తామన్నారు.

    Latest articles

    Peddapalli | కారులో చిక్కుకున్న చిన్నారి.. సెల్​ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడిన యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli | పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన చిన్న‌దిగా అనిపించిన‌,...

    Vice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ (NDA) ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన...

    Hyderabad | 128 కిలోల గంజాయి పట్టివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పాన్​ డబ్బాల నుంచి...

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    More like this

    Peddapalli | కారులో చిక్కుకున్న చిన్నారి.. సెల్​ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడిన యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli | పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన చిన్న‌దిగా అనిపించిన‌,...

    Vice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ (NDA) ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన...

    Hyderabad | 128 కిలోల గంజాయి పట్టివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పాన్​ డబ్బాల నుంచి...