అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి, మత్తు పదార్థాల లభ్యం, ఖైదీల వినియోగం, ఇతర పరిణామాలపై జైళ్ల శాఖ (Prisons Department) చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలు అధికారులపై (Central Jail officials) వేటు వేసింది.
ఒక జైలర్‌ను సస్పెండ్ చేయగా.. మరొకరిని బదిలీ (transfer) చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదీలను జైలు అధికారులు చితక బాదిన ఘటనను సీరియస్‌గా పరిగణించింది. అంతేకాకుండా జైలులోకి గంజాయి సరఫరా, వినియోగం తదితర వాటిపై తీవ్రంగా పరిగణించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది.
Nizamabad Central Jail | చర్యలేమిటంటే..
జైలులో జరుగుతున్న పరిణామాలపై ఈ నెల 3న జైళ్ల శాఖ డీఐజీ, ఐజీలు సంపత్, మురళీబాబు విచారణ చేపట్టారు. అనంతరం శాఖ డీజీపీకి నివేదిక సమర్పించారు. దీంతో డీజీపీ కార్యాలయం (DGP office) ఇద్దరు అధికారులపై వేటు వేసింది. జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేయగా.. మరో జైలర్ సాయిసురేష్ను ఆదిలాబాద్ సబ్‌కు జైలుకు బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథంను నెలరోజుల సెలవుకు సిఫారసు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ రావుకు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.