అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని (Municipal Commissioner Rajender Reddy) ఆదేశించారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో (Vidyanagar Colony) చేపడుతున్న పారిశుధ్య పనులను గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండి అధికంగా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వర్షాలు కురిసిన అనంతరం వాన నీరు నిలిచి ఆ నీటిలో దోమలు గుడ్లుపెట్టి దోమలు అధికంగా వృద్ధి చెందుతాయని కలెక్టర్ (Collector Ashish Sangwan) వివరించారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్(Oil balls) వేయాలని, డ్రెయినేజీలు శుభ్రం చేయాలని, డ్రైడే రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. మరొకసారి జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ (Drainages Blocked) కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలలో దెబ్బతిన్న పట్టణంలోని రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి (Kamareddy Municipality) నిర్దేశించిన రెండు లక్షల మొక్కలను ఈ నెల చివరిలోగా నాటికి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్ వివరాలను పొందుపర్చాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో మియావకి పద్ధతిలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు.