అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో (Neelam Ramachandraiah Bhavan) నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో భవన నిర్మాణం పూర్తికాక ముందే శ్రీ చైతన్య విద్యాసంస్థ (Chaitanya Educational Institutions) అడ్మిషన్లు చేపడుతోందన్నారు. ఇతర ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తోక పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మనోజ్, సాయికిరణ్, ప్రవేష్, ప్రసాద్, రాజు, తదితరులు పాల్గొన్నారు.