అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని శివాజీనగర్, సూర్యనగర్(Surya Nagar), పద్మానగర్, సీతారాంనగర్(Sitaram nagar)లలో గోవులను అపహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్ఆర్ చౌరస్తాపై (RR Chowrastha) కాలనీవాసులు, పాడి రైతులు (Dairy farmers) ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రనగర్ వద్ద ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. కాలనీవాసులు గమనించి వెంబడించామన్నారు. అయితే దుండగులు రాళ్లతో తమను కొట్టారని తెలిపారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సంపత్, శ్రీ వర్ధ న్, హరీష్, సునీల్, అంజయ్య పాల్గొన్నారు.
