అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy BRS | అనుమతులు లేకుండా చెట్లు నరికిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీఎఫ్వో నిఖితకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణ సీఐ (Kamareddy CI), మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్లపై ఉన్న చెట్లను అనుమతులు లేకుండా తొలగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ పట్టణ పచ్చదనాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఇప్పటికైనా అధికారులు అశోక్ నగర్లో (Ashok Nagar) బీటీ రోడ్లపై అనుమతులు లేకుండా చెట్లునరికి వేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, చెట్లు నరికిన వారితో మరిన్ని చెట్లను నాటించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
అధికారులు చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ (BRS Party) ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుంబాల రవి యాదవ్, బీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, మైనారిటీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మాజీద్, బీఆర్ఎస్ నాయకులు రమణ్, నరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
