అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tandoor Society | పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసకోవాలని కోరుతూ తాండూర్ సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీసీవో రామ్మోహన్‌కు (DCO Rammohan) ఫిర్యాదు చేశారు.
అనంతరం డైరెక్టర్లు బాబురావు, సిద్ధిరాంరెడ్డి మాట్లాడుతూ.. డైరెక్టర్లుగా ఉన్న తమకు ఎలాంటి సమాచారం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా తొలగించి కార్యదర్శి తమను అవమానపర్చారన్నారు.
తాము సొసైటీలో ఎలాంటి అప్పులు చేయలేదని.. పైగా సొసైటీకి ప్యాడీక్లీనర్ (Paddy cleaner) యంత్రాలు కొనడానికి డబ్బులు సైతం అందించామని పేర్కొన్నారు. అకారణంగా తమను డైరెక్టర్లుగా తొలగించారని కారణమైన పీఎసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారంరోజుల్లో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీవో హామీ ఇచ్చినట్లు డైరెక్టర్లు తెలిపారు.