అక్షరటుడే, ఇందూరు: Land grabbing తమ భూముల్ని ఆక్రమించి.. అడ్డుకుంటున్నందుకు తమపైనే అట్రాసిటీ కేసులు బనాయిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం మద్దేపల్లికి చెందిన బాధితులు డిమాండ్ చేశారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో భూ యాజమాని సింహాద్రి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. మద్దేపల్లి గ్రామ శివారులో తమకు 7.35 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని, తిరిగి మమ్మల్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. సదరు పొలంలో వేసిన పంట సైతం అమ్ముకున్నారని, ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బాధితుడు తెలిపారు. ధరణిలో అధికారుల తప్పిదంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.